జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యం: కొంపల్లి మహేష్
మనప్రజాప్రతినిధి/ రాజన్నసిరిసిల్ల
ఆగష్టు,25
ఉపాధ్యక్షులుగా కుమారస్వామి రాయన పట్ల
ప్రధాన కార్యదర్శిగా కర్రల రాజు
జనరల్ సెక్రెటరీ శ్రీగాద గణేష్
కోశాధికారిగా మహమ్మద్ షఫీ
సిరిసిల్ల పట్టణంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈ సమావేశంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం
అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కొంపల్లి మహేష్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి జర్నలిస్టు సోదరునికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
“జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే నా ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. సిరిసిల్లలో నూతనంగా ఏర్పాటైన రాజన్న ప్రెస్ క్లబ్ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాను” అని ఆయన అన్నారు.
కొంపల్లి మహేష్ ఎన్నిక సందర్భంగా జిల్లా జర్నలిస్టులు, వివిధ జర్నలిస్టు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.