పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు ఊపందిస్తున్న విలీన వివాదం
శక్తి పథకంపై విద్యార్థుల తీవ్ర అభ్యంతరాలుభవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న యువతప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్హైదరాబాద్,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ విశ్వవిద్యాలయంలో విలీనం చేసే ప్రతిపాదనపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయం తమ విద్యా, ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి మాట్లాడుతూ, తమ భవిష్యత్తును దృష్టిలో...