సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు..
దుర్వాసనతో ప్రజల అవస్థలులక్షలు ఖర్చు చేసి కట్టారు.. నిరుపయోగంగా వదిలేశారు!మనప్రజాప్రతినిధి/ రాజన్నసిరిసిల్ల ఆగష్టు,29 సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వచ్ఛతకు తూట్లుసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయం పక్కన ఉన్న మున్సిపల్ పబ్లిక్ మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. చాలా రోజులుగా మూతపడి ఉండటంతో పరిసర ప్రాంతమంతా పిచ్చి మొక్కలు పెరిగి, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.దీంతో ఆ మార్గంలో నడవడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఆర్డీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్, పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే...