చరిత్రకు ఒక్క అడుగు.. భారత జోడీ జోరు
పారిస్,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. మహిళల డబుల్స్‌లో త్రీసా జాలీ–గాయత్రి గోపీచంద్ జోడీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 16వ రౌండ్‌లో ఏడో సీడ్ జపాన్ జంట రిన్ ఇవనగా–కీ నకనిషిని వరుస సెట్లలో ఓడించింది. దీంతో భారత జోడీ చారిత్రాత్మక పతకానికి ఒక్క విజయం దూరంలో నిలిచింది.జపాన్ జంటకు షాక్39వ సీడ్‌గా బరిలోకి దిగిన త్రీసా–గాయత్రి జోడీ ఆరంభం నుంచే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. తొలి సెట్‌ను 21–16తో గెలిచిన భారత అమ్మాయిలు.. రెండో సెట్‌లో మరింత దూకుడుగా...