ప్రిన్సిపల్ హత్య కేసు ఛేదన

ఇద్దరు మైనర్ విద్యార్థులే నిందితులుడబ్బు కోసం దారుణ హత్యకు పాల్పడినట్లు వెల్లడి70 సీసీ కెమెరాల ఆధారంగా మిస్టరీ వీడిందినల్గొండ,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి ఇద్దరు మైనర్ విద్యార్థులే పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడిన ఈ ఇద్దరు విద్యార్థులు డబ్బు కోసం చోరీకి ప్రయత్నించి, పరిస్థితులు అనుకూలించకపోవడంతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల...