మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన నిరసనలు
జనగణనకు ముందు పౌర పట్టిక నవీకరణ డిమాండ్రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు పిలుపుపలు జిల్లాల్లో రహదారుల దిగ్బంధనంమూడు రోజుల పాటు విద్యాసంస్థల మూసివేతఇంఫాల్,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): బీజేపీ పాలిత మణిపూర్‌లో మరోసారి నిరసనల జ్వాలలు రగిలాయి. రాష్ట్రంలో జనాభా గణన చేపట్టే ముందు జాతీయ పౌర పట్టికను నవీకరించాలని వివిధ సామాజిక సంస్థలు డిమాండ్ చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి చేరే వరకు జనగణన నిర్వహించకూడదని ఆందోళనకారులు పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం న్యాయమైన, నిష్పక్షపాత...