‘రామాయణ’లో శూర్పణఖగా రకుల్
ముంబై,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రావణుడి సోదరి శూర్పణఖ పాత్రలో నటి రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. ఇప్పటివరకు శూర్పణఖ అంటే ప్రతినాయకురాలి పాత్రగానే చాలామందికి పరిచయం ఉన్నప్పటికీ, ఈ సినిమాలో ఆమె పాత్రను విభిన్న కోణాల్లో చూపించనున్నట్లు రకుల్ తెలిపారు.శూర్పణఖలో ఎన్నో కోణాలుశూర్పణఖ పాత్రలో తనను ఆకర్షించిన అంశాలు ఎన్నో ఉన్నాయని రకుల్ చెప్పారు. రావణుడి సోదరిగా మాత్రమే కాకుండా, లంకలో అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా శూర్పణఖను...