పిఠాపురం ఆధ్యాత్మిక వైభవానికి రూ.30.66 కోట్లు
- దేవాలయాలు,భజన మందిరాల అభివృద్ధికి భారీ నిధులు- ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో పనులకు వేగం- భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు- ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యంపిఠాపురం, ఆగస్టు 26 (మనప్రజాప్రతినిధి): పిఠాపురం నియోజకవర్గంలోని ఆధ్యాత్మిక, చారిత్రక క్షేత్రాల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రూ.30.66 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆలయాల పునరుద్ధరణ, భజన మందిరాల నిర్మాణం, కల్యాణ మండపాల అభివృద్ధి ద్వారా నియోజకవర్గ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిధులతో...