లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎస్సై పట్టుబాటు
స్టేషన్ బెయిల్ కోసం రూ.30 వేలు డిమాండ్రాజంపేట ఎస్సైపై అవినీతి కేసు నమోదుఇంట్లోనే లంచం తీసుకుంటూ పట్టుబాటుకామారెడ్డి,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు చార్జిషీట్‌లో తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేస్తానంటూ లంచం డిమాండ్ చేసిన ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై దువ్వాల ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సమాచారం ప్రకారం ఒక కేసులో నిందితుడిగా ఉన్న తన...