మణిపూర్‌లో ఉగ్రదాడి.. నలుగురు మృతి

°వాహనాన్ని అడ్డగించి కాల్పులు°మరో వ్యక్తి ఆచూకీ గల్లంతు°నాగా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత°నిందితుల కోసం ముమ్మర గాలింపుఇంఫాల్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): తరచూ హింసాత్మక ఘటనలతో వార్తల్లో నిలిచే మణిపూర్‌లో మరోసారి రక్తపాతం చోటుచేసుకుంది. కాంగ్‌పోక్పి జిల్లాలోని మకుయి అషాంగ్–తబాంబా నాగా ప్రాంతాల మధ్య గురువారం జరిగిన ఉగ్రదాడిలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తిని సాయుధులు తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, సాయుధులైన దుండగులు ప్రయాణికులతో వెళ్తున్న ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని...