హిమాలయాన్ని కుదిపేసిన నేపాల్ మహావిపత్తు

- 168 మందికి పైగా మృతి.. వేలాది మంది గల్లంతు- హిమనదం కూలిపోవడంతో విరుచుకుపడ్డ జలప్రళయం- కైలాస్ యాత్రికులు, విదేశీ పర్యాటకుల ఆచూకీ కోసం గాలింపు- మరో వరద ముప్పుపై అధికారుల హెచ్చరికఖాట్మండు,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన భారీ ఆకస్మిక వరదలు అపూర్వ విధ్వంసాన్ని సృష్టించాయి. హిమాలయాల్లోని ఒక భారీ హిమనదం కూలిపోవడంతో ఏర్పడిన నీరు, బురద, రాళ్ల ప్రవాహం భోటే కోషి, త్రిశూలీ నదీ పరివాహక ప్రాంతాలపై విరుచుకుపడింది. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 165 నుంచి 168...