రాజీయే రాజమార్గం… లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు
ఎం.హేమలత…జూనియర్ సివిల్ జడ్జ్ కం చైర్మన్, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ, నర్సాపూర్
మెదక్/ నర్సాపూర్/ సెప్టెంబర్12
( ప్రజా ప్రతినిధి దినపత్రిక)
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో, జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు, జాతీయ లోక్ అదాలత్ శనివారం సెప్టెంబర్ 12 జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జూనియర్ సివిల్ జడ్జ్ కం చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఎం.హేమలత మాట్లాడుతూ….రాజీయే రాజమార్గమని, లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పుని, అన్నారు, అదేవిధంగా రాజీ చేయదగిన కేసుల్లో ఇరువర్గాలు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకొని స్నేహ పూరిత భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆమె సూచించారు. లోక్ అదాలత్ ద్వారా వెలువడే తీర్పు అంతిమ తీర్పుగా పరిగణించబడుతుందని తెలియచేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కోర్టు ఏ జి పి డి.శ్రీధర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.శ్రీనివాస్ గౌడ్, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్ శాస్త్రుల మధుశ్రీశర్మ, లీగల్ సర్వీస్ న్యాయవాది కాట్రోత్.రాజు నాయక్, కౌడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అమరేందర్ రెడ్డి, చిలప్ చెడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సింలు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్….
సీనియర్ న్యాయవాది ఆర్. శ్రీనివాస్ రెడ్డి,ఈ.సత్యనారాయణ,సి.హెచ్.స్వరూపరాణి, పి.సుధాకర్, న్యాయవాదులు నాగరాజు,జాట్రోత్ రవినాయక్, ఏ.సాయిరాం, బి. మానయ్య, నీలవేణి,కోర్టు సూపర్డెంట్ ఎం.ఎల్. సూర్య ప్రకాష్, లీగల్ సర్వీస్ టైపిస్ట్ కం అసిస్టెంట్ కే.సుభాష్, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీస్ కోర్టుసిబ్బంది, కోర్టు పోలీస్ కానిస్టేబుల్స్, హరిబాబు గౌడ్, దిలీప్ గౌడ్, శ్రీనివాస్, ఆనంద్, కక్షిదారులు పాల్గొనడం జరిగింది. లోక్ అదాలత్ లో పలు కేసులను పరిష్కరించడం జరిగింది.