తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఏబీవీపీ

మన ప్రజా ప్రతినిధి దినపత్రిక మిర్యాలగూడ సెప్టెంబర్ 17తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ కళాశాలలో  నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరులను, వారి త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మిర్యాలగూడ టౌన్ వైస్ ప్రెసిడెంట్ వంశీ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. గత చరిత్ర మనకు ధైర్యంగా నిలబడటం, అన్యాయాన్ని ఎదుర్కోవడం సమాజం పట్ల బాధ్యతగా ఉండటం వంటి విలువలను నేర్పిస్తుందని పేర్కొన్నారు...