మర్పడగలో ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం.
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.సెప్టెంబర్21కొండపాక మండలంలోని మార్పడగ గ్రామంలో శ్రీ ఆంజనేయం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వినాయకుడి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు, అక్కాచెల్లెళ్లు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహికంగా కుంకుమార్చనలో పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించారు.మహిళలు ఆలపించిన భక్తిగీతాలు, మంగళహారతులతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.