271 సర్వే నంబర్‌లో అధికారుల సర్వే

"50 మంది రైతులకు నోటీసులు.. ఆధారాల పరిశీలనమనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.సెప్టెంబర్24కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులోని 271 సర్వే నంబర్‌లో ఉన్న 327.09 ఎకరాల ప్రభుత్వ భూములపై అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. గజ్వేల్ డివిజన్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వంశీ ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.ఈ సందర్భంగా అధికారులు రికార్డులను పరిశీలిస్తూ భూముల హద్దులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 271 సర్వే నంబర్ పరిధిలో మొత్తం 329 మంది రైతులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో సర్వే నంబర్‌లోని మొత్తం భూమికి సర్వే, కొలతలు...