manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 2:04 pm Posted by : MANA PRAJA PRATINIDHI

ఆల్మస్పూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణమాసం వేడుకలు

మనప్రజాప్రతినిధి
అక్బర్ పేట్ భూంపల్లి మండల్
సిద్దిపేట జిల్లా.

పోషణ మాసం కార్యక్రమాల్లో బాగంగా ఆల్మస్ పూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ బాలల పరిరక్షణ కమిటీ విపిసిది ఏర్పాటు చేసి, బాలల హరులు, బాలల రక్షణ, పోషకాహారం మరియు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  గ్రామ స్థాయిలో బాలల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో వి సి పి పి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. గ్రామాల్లో బాలలపై వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మికత్వం, బాలల అక్రమ కవాణా వంటి సమస్యలను అరికట్టేందుకు కమిటీ సభ్యులు, ప్రజలు మరియు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పిల్లలకు విద్య, ఆరోగ్యం, పోషకాహారం, రక్షణ మరియు సంక్షేమ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాలల సమస్యలను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి అవసరమైన రక్షణ మరియు సహాయం అందేలా చూడాలని సూచించారు.  పిల్లలకు ఏదైనా ప్రమాదం, వేధింపులు, బాల్య వివాహం, బాల కార్మికత్వం, నిర్లక్ష్యం లేదా ఇతర సమస్యలు

ఎదురైనప్పుడు వెంటనే వైల్డ్ హెల్ప్ లైన్ 1098కు సమాచారం అందించాలని సూచించారు. పిల్లల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్థులు చాధ్యతగా స్పందించాలని కోరాడు. అలాగే పోషణ్ అభియాన్లో భాగంగా పిల్లలు, గర్భిణీలు మరియు బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. నవజాత శిశు సంరక్షణ, బాలల సంరక్షణ మరియు శిశువు జీవితంలోని మొదటి 1000 రోజులు అత్యంత కీలకమైనవని ఈ కాలంలో తల్లి మరియు శిశువుకు సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సెక్టార్ సూపర్ వైజర్ ఆర్. విజయలక్ష్మి మాట్లాడుతూ… మొదటి 1000 రోజుల్లో తల్లి మరియు శిశువుకు అందించే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ పిల్లల భవిషన్ ఎదుగుదలకు ఎంతో ముఖ్యమని తెలిపారు. తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను యోగ చేసుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్ యం పద్మమల్లేశం మాట్లాడుచు…
గ్రామంలోని ప్రతి చిన్నారికి ఆరోగ్యం, పోషకాహారం, విద్య మరియు రక్షణ అందేలా అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశవర్కర్ ఇందిర.అంగన్వాడీ టీచర్ వెంకటమ్మ.ఆయా భాగ్య. స్కూల్ టీచర్ సుప్రియశ్రీ. అనిత పి.మండల ఉమా.పద్మ. లక్ష్మి. మల్లవ్వ. కనకవ్వ. తదితరులు పాల్గొన్నారు