manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:24 pm Posted by : Mana Praja Prathinidhi

రాజీవ్ రహదారిపై 12 ఏళ్ల సేవకు సలాం..ఆర్పిఓ రమేష్‌కు ఘన వీడ్కోలు

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.సెప్టెంబర్1

°విధి నిర్వహణలో అంకితభావం.. ఆత్మీయంగా సన్మానించిన టోల్ ప్లాజా సిబ్బంది
°ప్రజలు, పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందిన రమేష్

°12 ఏళ్లకు పైగా రాజీవ్ రహదారిపై రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్‌గా సేవలు.
దుద్దెడ:రాజీవ్ రహదారిపై దుద్దెడ టోల్ ప్లాజా పరిధిలో రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్‌ (ఆర్పివో )గా 12 సంవత్సరాల 16 రోజులు విధులు నిర్వహించిన రమేష్‌ పదవీ విరమణ సందర్భంగా టోల్ ప్లాజాలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా టోల్ ప్లాజా ఉద్యోగులు రమేష్‌కు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
రాజీవ్ రహదారిపై విధులు నిర్వహించే క్రమంలో రమేష్‌ ప్రజలు, పోలీస్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి మంచి ఆదరణ పొందారని పేర్కొన్నారు. రహదారిపై ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సమయాల్లో అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు.
దీర్ఘకాలం బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న రమేష్‌కు ఉద్యోగులు, సహచరులు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబంతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.