manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 7:41 pm Posted by : MANA PRAJA PRATINIDHI

తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు

మన ప్రజా ప్రతినిధి దినపత్రిక మిర్యాలగూడ సెప్టెంబర్17:

మిర్యాలగూడ వన్ టౌన్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హౌసింగ్ బోర్డ్ మిర్యాలగూడ అసెంబ్లీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు వన్ టౌన్ పట్టణ అధ్యక్షులు బంటు గిరి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ  సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయకపోవడం సిగ్గుచేటు అని ఆనాడు నిజం రజాకర్ల మెడలు వంచి ఆపరేషన్ పోలో ద్వారా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నియంత పాలన నుంచి విముక్తి కల్పించి ఈ ప్రాంతాన్ని భారత్ లో ఐక్యం చేసినారు అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శిలు కొంగరి వెంకటరమణ మూల  రాజిరెడ్డి వన్ టౌన్ ఉపాధ్యక్షులు చిలుకూరి వెంకటేశ్వర్లు మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు గోనే కవిత రెడ్డి ఓబీసీ మోర్చా  పట్టణ అధ్యక్షులు మండల సోములు సీనియర్ నాయకులు బంటు సైదులు రేపాల  పురుషోత్తం రెడ్డి ఎడ్ల రమేష్ కొండేటి సరిత మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెలుగు ఇందిరా నాగరాజ్ గుండ్లపల్లి శ్రీకాంత్ కంచుకొమ్ముల వేణు తల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు