ఆలయాలే టార్గెట్.. వరుస దొంగతనాలకు చెక్!
"గంటల దొంగ అరెస్ట్..స్కూటీ,రించ్‌పానా,ఆలయ గంటలు స్వాధీనం సిద్దిపేటరూరల్,సెప్టెంబర్(మనప్రజాప్రతినిధి):సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆలయాలను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆలయంలో దొంగతనానికి యత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్ ఆదివారం కేసు వివరాలను వెల్లడించారు.నిందితుడి వివరాలు:దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన ఆస సుదర్శన్ (35), తండ్రి రాజమల్లయ్య, వృత్తిరీత్యా డ్రైవర్‌గా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి నలుపు రంగు సుజుకి అవెనిస్ స్కూటీ (TS10FC7843), ఆకుపచ్చ...