manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 11:35 am Posted by : Mana Praja Prathinidhi

ఆధ్యాత్మిక శోభతో మర్పడగ క్షేత్రం.భక్తిశ్రద్ధలతో ఆర్ద్రా మహోత్సవం

“పూజలు.. అభిషేకాలు.. హోమాలతో వైభవం
మర్పడగలో ఘనంగా ఆర్ద్రా మహోత్సవం

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం:అక్టోబర్4
మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున క్షేత్రంలో శనివారం ఆర్ద్రా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో గణపతి పూజ, స్వస్తివాచనం నిర్వహించి నవగ్రహ,దిక్పాలక, రుద్రకలశ స్థాపనలు చేపట్టారు.
స్థాపిత దేవతల పూజ అనంతరం సంతాన మల్లికార్జున స్వామివారికి విశేష పంచామృత, ఫలరస అభిషేకాలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం స్థాపిత దేవతా హవనం, సంతాన పాశుపత హవనం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విజయదుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. మోహనకృష్ణశర్మ వైదిక నిర్వహణలో కార్యక్రమాలు కొనసాగగా, ఋత్విజులుగా బి. లక్ష్మణరావు, కృష్ణకిషోర్ పాండే వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణ కమిటీ సభ్యులు చీకోటి మల్లికార్జున్, మర్యాల వీరేశం, దేవసాని మల్లేశం, మర్యాల రవీందర్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.