ఆధ్యాత్మిక శోభతో మర్పడగ క్షేత్రం.భక్తిశ్రద్ధలతో ఆర్ద్రా మహోత్సవం

"పూజలు.. అభిషేకాలు.. హోమాలతో వైభవంమర్పడగలో ఘనంగా ఆర్ద్రా మహోత్సవం మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం:అక్టోబర్4మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున క్షేత్రంలో శనివారం ఆర్ద్రా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో గణపతి పూజ, స్వస్తివాచనం నిర్వహించి నవగ్రహ,దిక్పాలక, రుద్రకలశ స్థాపనలు చేపట్టారు.స్థాపిత దేవతల పూజ అనంతరం సంతాన మల్లికార్జున స్వామివారికి విశేష పంచామృత, ఫలరస అభిషేకాలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం స్థాపిత దేవతా హవనం, సంతాన పాశుపత...