“కాళేశ్వరంపై కక్షా?మల్లన్నసాగర్‌పై కుట్రా?”
“బ్లాస్టింగ్‌ల వెనుక ఎవరు? హరీశ్‌రావు సంచలన ప్రశ్న”
“మల్లన్నసాగర్ భద్రతతో చెలగాటమా?”అక్రమ బ్లాస్టింగ్స్‌పై హరీశ్‌రావు ఫైర్
“కాంగ్రెస్ పాలనలో మల్లన్నసాగర్‌కూముప్పు:హరీశ్‌రావు ఫైర్””కట్టకు 150 మీటర్ల దూరంలో పేలుళ్లా?మంత్రి ఉత్తమ్ వెంటనే సమీక్షించాలి…
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.అక్టోబర్30
మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్టకు కేవలం 150 నుంచి 200 మీటర్ల దూరంలో అనుమతులు లేకుండా భారీ బ్లాస్టింగ్‌లు నిర్వహించడం వెనుక ఎవరి హస్తం ఉందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని అవలంబిస్తోందని, ఇప్పుడు మల్లన్నసాగర్ భద్రతను కూడా ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితులు సృష్టిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రిజర్వాయర్ కట్టకు ఇంత సమీపంలో జిలెటిన్ స్టిక్స్‌తో పేలుళ్లు నిర్వహించేందుకు ఎవరు అనుమతిచ్చారు? ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, గ్రామపంచాయతీ శాఖల అనుమతులు లేకుండా బ్లాస్టింగ్‌లు ఎలా జరుగుతున్నాయని అధికారులను నిలదీశారు. రాత్రివేళల్లో బ్లాస్టింగ్‌లు నిర్వహించడం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు.
తిప్పారం గ్రామంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్ ట్యాంక్ నిర్మాణం కోసం చేపడుతున్న బ్లాస్టింగ్ ప్రాంతాన్ని హరీశ్‌రావు గురువారం పరిశీలించారు. పేలుళ్ల కారణంగా గ్రామంలోని కొన్ని గోడలకు ఏర్పడిన నెర్రెలను, మల్లన్నసాగర్ కట్ట వద్ద సీపేజీని పరిశీలించారు.
“మల్లన్నసాగర్‌ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?” అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రిజర్వాయర్ భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
గతంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన ఘటనను ప్రస్తావించిన హరీశ్‌రావు.. అప్పట్లో ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు మల్లన్నసాగర్ వద్ద జరుగుతున్న బ్లాస్టింగ్‌లపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే రంగంలోకి దిగి మల్లన్నసాగర్ బ్లాస్టింగ్ వ్యవహారంపై సమీక్ష నిర్వహించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా పేలుళ్లకు పాల్పడుతున్న అధికారులు, సంబంధిత ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మల్లన్నసాగర్ భద్రతతో రాజకీయాలు చేయకుండా, రిజర్వాయర్ రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
హరీశ్‌రావు వెంట దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.