లలిత త్రిపుర సుందరి అవతారంలో దుర్గామాత
•శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణ – అమ్మవారికి 108 కిలోల ఒడిబియ్యం సమర్పణమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.అక్టోబర్16మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు దుర్గామాత లలిత త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాథ్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి, అమ్మవారికి విశేష ఫలరస, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి...