పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి గ్రామ పంచాయతీ సిబ్బంది అండ.

"మృతుడు బాలరాజ్ కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేతమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.అక్టోబర్7ఇటీవల మృతి చెందిన ఇర్కోడ్ గ్రామ పారిశుధ్య కార్మికుడు తాటిగాని బాలరాజ్ కుటుంబానికి గ్రామ పంచాయతీ అండగా నిలిచింది. బాలరాజ్ కుటుంబాన్ని సర్పంచ్ ఘణపురం కృష్ణతో పాటు పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సహాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో సర్పంచ్ ఘణపురం కృష్ణ, కారోబారి శాప...