manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 4:13 pm Posted by : Mana Praja Prathinidhi

మిర్యాలగూడెంలో కలకలం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ యువకుడి నిరసన

_న్యాయం చేయాలంటూ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన యువకుడు.. మిర్యాలగూడలో తీవ్ర ఉత్కంఠ

మనప్రజాప్రతినిధి//మిర్యాలగూడ:

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ యువకుడు బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అర్హులైన పేదలను పక్కనపెట్టి, అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని యువకుడు ఆరోపించాడు. స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ, తనలాంటి అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.యువకుడు టవర్ ఎక్కడంతో స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.