మిర్యాలగూడెంలో కలకలం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ యువకుడి నిరసన
_న్యాయం చేయాలంటూ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన యువకుడు.. మిర్యాలగూడలో తీవ్ర ఉత్కంఠ మనప్రజాప్రతినిధి//మిర్యాలగూడ: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ యువకుడు బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.అర్హులైన పేదలను పక్కనపెట్టి, అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని యువకుడు ఆరోపించాడు. స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ, తనలాంటి అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్పందించి తక్షణమే చర్యలు...