చిన్నారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న సీపీ రష్మి పెరుమాళ్

"అనాథ చిన్నారుల మధ్య వెలుగులు నింపిన సీపీ.. ఆత్మీయంగా దీపావళి వేడుకలు"అనాథాశ్రమ చిన్నారులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ"మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్10దీపావళి పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ అనాథాశ్రమ చిన్నారులతో కలిసి పండుగ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.మండల కేంద్రంలోని నిశాంత్ ఆనంద బాలసదన్ అనాథాశ్రమాన్ని సందర్శించిన సీపీ రష్మి పెరుమాళ్ చిన్నారులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆశ్రమంలోని చిన్నారుల సమస్యలు,...