manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 10:46 am Posted by : Mana Praja Prathinidhi

అర్హులకు చేయూత పెన్షన్ల మంజూరు..పత్రాలు అందజేసిన సర్పంచ్

ఏళ్ల నిరీక్షణకు తెర.. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్19
కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను బుధవారం గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్ పంపిణీ చేశారు. ఏళ్ల తరబడి పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం తీపి కబురు అందించిందని ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన వారికి చేయూత పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమని, గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తూ మహిళలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పిస్తోందన్నారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు పార్టీలకు, కులమతాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన పెన్షన్లు అందించడం అభినందనీయమన్నారు. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.