అర్హులకు చేయూత పెన్షన్ల మంజూరు..పత్రాలు అందజేసిన సర్పంచ్

ఏళ్ల నిరీక్షణకు తెర.. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలుమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్19కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను బుధవారం గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్ పంపిణీ చేశారు. ఏళ్ల తరబడి పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం తీపి కబురు అందించిందని ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన వారికి చేయూత పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమని, గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం ఆనందంగా...