నేరేడుచర్ల చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలుమన ప్రజా ప్రతినిధి’ కథనానికి స్పందన.. రంగంలోకి దిగిన అధికారులు, పోలీస్ సిబ్బంది

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో వాహనాల రాకపోకలు అధికం కావడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వ్యాపార సముదాయాలు, రహదారులపై వాహనాల రద్దీ కారణంగా ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.ఈ సమస్యపై ప్రజల ఇబ్బందులను వెలుగులోకి తీసుకువస్తూ మన ప్రజా ప్రతినిధి దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురించడం జరిగింది. దీంతో సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు...