హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం మీడియాకు అనుమతి నిరాకరణ

మనప్రజాప్రతినిధి//హుజూర్ నగర్, నవంబర్ 10స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు (మంగళవారం) ఉదయం నిర్వహించ తలపెట్టిన హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం వివాదాస్పదంగా మారింది. ప్రజా సమస్యలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవాల్సిన ఈ అత్యున్నత సమావేశానికి మున్సిపల్ మేనేజర్  మీడియాను అనుమతించక పోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పట్టణాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలు, ప్రజా సమస్యలు, వార్షిక కేటాయింపులు మరియు మౌలిక వసతుల కల్పనపై చర్చించేందుకు మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే సమావేశాన్ని కవర్ చేయడానికి వచ్చిన స్థానిక మీడియా...