మహిళలతో అసభ్య ప్రవర్తన.. ఏర్పేడు తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్ ఆగడాలు!
ఎమ్మార్వో మాటకే విలువ లేదా? మహిళల పట్ల దురుసు ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు.. ఉన్నతాధికారులు నిద్రపోతున్నారా?మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా ప్రత్యేక కథనంఏర్పేడు: ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన కార్యాలయంలోనే మహిళలకు అవమానాలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తిరుపతి జిల్లా ఏర్పేడు మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.మహిళలంటే అంత చులకనా?ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే మహిళలతో మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉద్యోగి...