నీళ్లు పడి ఏడాది చిన్నారికి తీవ్ర గాయాలు
"తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బందిమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్21మండలంలోని జప్తినాచారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వేడి నీళ్లు మీద పడటంతో ఏడాది వయసున్న చిన్నారి తీవ్రంగా గాయపడింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి పుట్టిన వెంటనే తల్లి మరణించడంతో అప్పటి నుంచి నానమ్మ సంరక్షణలో పెరుగుతోంది. ఈ క్రమంలో చిన్నారికి స్నానం చేయించేందుకు వేడి నీళ్లు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆ నీళ్లు చిన్నారిపై పడటంతో శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న కొండపాక 108 అంబులెన్స్ సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ శివ, పైలట్ శ్రీనివాస్...