manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 9:41 am Posted by : Mana Praja Prathinidhi

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం

“కారు ఢీకొని బైకుపై వెళ్తున్న వ్యక్తి మృతి..
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్21
కారు, బైకు ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన దుద్దెడ శివారులో తొగుట వెళ్లే మార్గంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తడకపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బండ్ల సిద్దయ్య బైకుపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిద్దయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.