manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 6:20 pm Posted by : Mana Praja Prathinidhi

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు విజయఢంకా

“సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు జోరు
“ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్ జట్లపై ఘనవిజయం..
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లా.నవంబర్19
చండీగఢ్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ జాతీయస్థాయి బాలికల అండర్-19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది.
పోటీల్లో భాగంగా గురువారం జరిగిన మొదటి లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు ఆంధ్రప్రదేశ్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 9-3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
అదేవిధంగా రెండో లీగ్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టుతో తలపడి 18-14 పాయింట్ల తేడాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు లీగ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి తెలంగాణ జట్టు తన సత్తా చాటింది.
శుక్రవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ జట్టుతో తెలంగాణ జట్టు తలపడనుంది.
ఈ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్న తెలంగాణ జట్టుకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల ద్వారా క్రీడాకారులను ఎంపిక చేశారు.
వరుస విజయాలు సాధిస్తున్న తెలంగాణ జట్టును ఆ జట్టు మేనేజర్ మంతెన సమ్మయ్య అభినందించారు. రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇదే ఉత్సాహంతో రాణించి జాతీయస్థాయిలో తెలంగాణకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.