manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:23 am Posted by : Mana Praja Prathinidhi

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

“మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
“డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్17
కొండపాక: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
కొండపాక మండలంలోని కొండపాక, వెలికట్ట, దుద్దెడ, మర్పడగ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చిట్టి దేవేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందించడంలో కొనుగోలు కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడంలో గ్రామ పంచాయతీలు ఎల్లప్పుడూ ముందుంటాయని ఆయా గ్రామాల సర్పంచులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వీరుపాక శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు కనుక రాములు, పీఏసీఎస్ డైరెక్టర్ సురేందర్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.