_విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమా? అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట!
_తెలంగాణలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)లో తాగునీటి కలుషితంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
_వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్న విద్యాసంస్థలోనే తాగునీటి నాణ్యతపై ప్రశ్నలు తలెత్తడం ఆందోళనకరం.
_విద్యార్థులకు అందించాల్సిన తాగునీరు సురక్షితంగా లేకపోతే వారి ఆరోగ్యానికి బాధ్యత ఎవరిది? _విద్యార్థుల ప్రాణాల కంటే అధికారులకు నిర్లక్ష్యమే ముఖ్యమైందా?
మనప్రజాప్రతినిధి//బాసర
విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం కనీస బాధ్యత. కానీ కలుషిత నీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించాల్సిన యంత్రాంగం ఏం చేస్తోంది? నీటి శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించారా? నీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నారా? విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయా?
ఇది చిన్న సమస్య కాదు.. వేలాది మంది విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలి. కలుషిత నీటి సరఫరాకు కారణాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పూర్తిస్థాయిలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి, విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించాలి.విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదు. బాసర ట్రిపుల్ ఐటీలో స్వచ్ఛమైన తాగునీరు అందే వరకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్..