అతివేగంతో హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లిన బోర్వెల్ వాహనం
మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్ 28జిల్లా కేంద్రంలోని చంద్రంపేట మూలమలుపు వద్ద ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. అతివేగంగా వచ్చిన ఓ బోర్వెల్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లింది.స్థానికుల కథనం ప్రకారం, గణేష్ బోర్వెల్‌కు చెందిన వాహనం అతివేగంగా, అజాగ్రత్తగా చంద్రంపేట మలుపు వద్దకు చేరుకోవడంతో నియంత్రణ కోల్పోయింది. వాహనం నేరుగా ఆలయ గోడను బలంగా ఢీకొట్టడంతో గోడ పూర్తిగా ధ్వంసమైంది.ప్రమాదం జరిగిన సమయంలో ఆలయ పరిసర ప్రాంతంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణ నష్టం తప్పింది. ఈ...