దళిత ఉపాధ్యాయుడిపై అమానుష దాడి… దోషులపై వెంటనే ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్

•దళిత ఉపాధ్యాయుడిపై దాడి అంటే దళిత సమాజంపై దాడే… •దోషులపై వెంటనే ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి!•మైసగళ్ళ బుచ్చేంద్ర మాదిగ,ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుఏర్పేడు.మునిపల్లి,జనవరి20(మనప్రజాప్రతినిధి):మునిపల్లి మండలం చిన్న చల్మెడ గ్రామానికి చెందిన దళిత ఉపాధ్యాయుడు చంద్రయ్యపై జరిగిన అమానుష, దౌర్జన్య దాడిని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి ఆలస్యం లేకుండా ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైసగళ్ళ...