సూరారంలో అభినందన సభ-ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి.
సదాశివాపేట,జనవరి21(మనప్రజాప్రతినిధి):సదాశివాపేట మండలం సూరారం గ్రామంలో సర్పంచ్ ముగ్ధం పటేల్ ఆధ్వర్యంలో అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు.సూరారం సర్పంచ్ ముగ్ధం పటేల్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు...