అంకిరెడ్డిపల్లిలో నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం.
•గ్రామఅభివృద్ధికిసమర్థనాయకత్వంఅవసరం-BJYM అధ్యక్షుడు తాళ్లపల్లి ప్రవీణ్ గౌడ్ మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్24అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గాలి బాలయ్యను భారతీయ జనతా యువమోర్చా (BJYM) అధ్యక్షుడు తాళ్లపల్లి ప్రవీణ్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసంతో వచ్చిన ఈ బాధ్యతను నూతన సర్పంచ్ సమర్థవంతంగా నిర్వర్తిస్తూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామంలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధితో...