ఇర్కోడ్ గ్రామంలో యువత పాలనకు ఘన ఆరంభం “పదివార్డుల్లో ఆరు యువత కైవసం-యువ సర్పంచ్‌తో కొత్త పాలనకు నాంది.

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.డిసెంబర్22 స్థానిక సంస్థల ఎన్నికలు ఇర్కోడ్ గ్రామంలో ప్రజాస్వామ్యానికి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. గ్రామ అభివృద్ధి దిశగా యువత ముందుకు రావడంతో ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు మరింత బలపడ్డాయి. పది వార్డు సభ్యుల స్థానాలకు గాను ఆరు వార్డులను యువత కైవసం చేసుకోవడం గ్రామ రాజకీయాల్లో యువ విప్లవానికి నిదర్శనంగా నిలిచింది.ముఖ్యంగా ఇర్కోడ్ గ్రామానికి యువకుడైన గణపురం కృష్ణ సర్పంచ్‌గా ఎన్నిక కావడం విశేషంగా మారింది. యువ సర్పంచ్‌తో పాటు యువ వార్డు సభ్యుల విజయంతో గ్రామ పాలన మొత్తం యువశక్తి చేతుల్లోకి రావడం...