ఇంజక్షన్ వికటించి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్29:రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్.ఎం.పి (RMP) డాక్టర్ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.సారంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ హమీద్ (47), తండ్రి ఇస్మాయిల్, సోమవారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో ఛాతీలో మంటగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో ఆందోళన చెందిన వారు అతడిని వెంటనే బద్దెనపల్లి గ్రామంలోని ఆర్.ఎం.పి డాక్టర్ మచ్చ పర్శరాములు వద్దకు తీసుకెళ్లారు.హమీద్‌ను పరిశీలించిన...