విద్యకు వసంతం…సంస్కృతికి పరిమళం

•మిలగిరిపేట ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలుసదాశివపేట.జనవరి23(మనప్రజాప్రతినిధి)సదాశివపేట మండలం మిలగిరి పేట ప్రాథమిక పాఠశాలలో వసంత పంచమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యాదేవత సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలకు మరింత వైభవం చేకూర్చారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ షాబుద్దీన్, ఉపసర్పంచ్ యాదయ్య, వార్డు మెంబర్ నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, వసంత పంచమి వంటి పండుగలు విద్యార్థుల్లో విజ్ఞానం, సంస్కృతి,...