విద్యుదాఘాతంతో యువ రైతు దుర్మరణం
మెదక్జిల్లా,మెదక్ మండలం.గుట్టకిందిపల్లి(మనప్రజాప్రతినిధి)డిసెంబర్20మెదక్ జిల్లా మెదక్ మండలంలోని గుట్టకిందిపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ యువ రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.గ్రామీణ ఠాణా ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన ఐతర బోయిన చంద్రం (30) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో సాదాసీదాగా జీవిస్తున్న చంద్రం కుటుంబానికి ఏకైక ఆధారస్తంభంగా ఉన్నాడు.శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చంద్రం తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న బోరు...