ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
20మందికిపైగా ప్రయాణికులకు గాయాలుమనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్24కొండపాక మండల పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా, దుద్దెడ శివారులోని నాగులబండ వద్ద రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కొండపాక, కొమురవెల్లి, చేర్యాల్, సిద్దిపేట ప్రాంతాల నుంచి 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మెడికల్ టెక్నీషియన్ శిరీష, పైలెట్ శ్రీనివాస్ సహకారంతో గాయపడిన వారిలో ఏడుగురిని...