manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 5:12 pm Posted by : Mana Praja Prathinidhi

పార్టీ బంధానికి మరో ఉదాహరణ

పార్టీబంధానికి మరో స్ఫూర్తిదాయక ఉదాహరణ

వేరువేరు ప్రమాదల్లో ఉన్నా పార్టీకార్యకర్తలను కలిసి భోరోసా

•కార్యకర్తే పార్టీ బలం అని నిరూపించిన టీడీపీ నేతలు…

ఏర్పేడు,జనవరి18(మనప్రజాప్రతినిధి):

ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పట్ల కుటుంబ సభ్యుల్లా అండగా నిలిచారు. బైక్ ప్రమాదంలో గాయపడిన ఒక కార్యకర్తను, అనారోగ్యంతో బాధపడుతున్న మరో కార్యకర్తను ఒకే రోజులో వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించి, పార్టీ అనుబంధాన్ని చాటారు.ఈ సందర్భంగా ఏర్పేడు మండల టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు మాట్లాడుతూ కార్యకర్తల కష్టసుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు రాచటి సుబ్రహ్మణ్యం, ఆమందూరు సర్పంచ్ గుణాయాదవ్, పార్లమెంట్ అధికార ప్రతినిధి కేకే రమణ, నరేంద్ర, గోపాల్ రెడ్డి, శివ రెడ్డి, మారయ్య పాల్గొన్నారు.బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న నేతలు, అవసరమైన సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.కార్యకర్తే పార్టీకి ప్రాణశక్తి అన్న స్ఫూర్తిని మరోసారి టీడీపీ నేతలు చేతలతో చూపించారు..