మర్పడగ క్షేత్రంలో వైభవంగా ఆర్ద్రా మహోత్సవం
°భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. అన్నప్రసాద వితరణమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఆగస్టు11మండపాక మండలంలోని మర్పడగ గ్రామంలో గల శ్రీవిజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున క్షేత్రంలో సోమవారం ఆర్ద్రా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు గణపతిపూజ, స్వస్తివాచనం నిర్వహించారు. అనంతరం నవగ్రహ, దిక్పాలక, రుద్రకలశ స్థాపన కార్యక్రమాలను చేపట్టారు.స్థాపిత దేవతల పూజ అనంతరం సంతాన మల్లికార్జున స్వామివారికి విశేష పంచామృత, ఫలరస అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం స్థాపిత దేవతా హవనం, సంతాన పాశుపత హవనం,...