ఘనంగా ఆర్ద్రా మహోత్సవం

బ్రాహ్మీ ముహూర్త ఆర్ద్రాభిషేకంలో పాల్గొన్న కలెక్టర్ హైమవతిమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్8కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆదివారం ఆర్ద్రా మహోత్సవం మహోన్నతంగా నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.మార్గశిర మాసంలో సంభవించిన ఆర్ద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని, బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకు గణపతి పూజతో వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సంతాన మల్లికార్జున స్వామికి పంచామృత, ఫలరసాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమవతి ఆలయానికి విచ్చేసి...