manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 1:31 pm Posted by : Mana Praja Prathinidhi

సైబర్ క్రైమ్స్‌పైవిద్యార్థులకుఅవగాహన సదస్సు

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 05
యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి అని సైబర్ సెల్ ఇన్‌చార్జ్ ఆర్‌.ఎస్‌.ఐ జునైద్ సూచించారు. సమాజిక మాధ్యమాల్లో జాగ్రత్తలు తప్పనిసరిఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, లింకులు, ఫ్రెండ్ రిక్వెస్టులు పట్ల జాగ్రత్త అవసరమని తెలిపారు.ఎటువంటి సైబర్ మోసాలు జరిగినా వెంటనే 1930 కి కాల్ చేయాలని, ఫోన్‌లో “ప్రాడ్ ప్రొటెక్షన్ స్టాఫ్” (Fraud Alert) సెట్టింగ్‌లను పెట్టుకోవాలని సూచించారు.యెల్లారెడ్డిపేట ఎస్ఐ రాహుల్ రెడ్డి సూచనలుసబ్ ఇన్స్పెక్టర్ రాహుల్ రెడ్డి మాట్లాడుతూఅనవసర నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఎత్తకూడదన్నారు.ఎవరికైనా ఓటీపీ,బ్యాంక్ వివరాలు,పాస్వర్డ్‌లుఇవ్వకూడదని హెచ్చరించారు.అపరిచితులపై నమ్మకం చూపరాదని, విద్యార్థులు మంచి మార్గంలో సాగి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని సూచించారు.పోస్టర్ విడుదలప్రతిజ్ఞ కార్యక్రమంసదస్సు సందర్భంగా సైబర్ క్రైమ్ పోస్టర్లు ఆవిష్కరించి, వి ద్యార్థులకు సైబర్ భద్రతపై ప్రతిజ్ఞచేయించారు.ఈకార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్‌చార్జ్ జునైద్, ఎస్ఐ రాహుల్ రెడ్డి,కళాశాల ఇన్‌ఛార్జ్ వాసరవేణి పర్శరాములు, అధ్యాపకులు బుట్ట కవిత, జాతోతు శ్రీనివాస్, వెల్దండి సౌమ్య, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, ఎం.డి. తాజోద్దిన్, షాహిన సుల్తానా, కానిస్టేబుల్స్ అభిషేక్, విజయ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.